వ్యాపారుల‌కు ప్ర‌కాశం జిల్లా క‌లెక్ట‌ర్ చుక్క‌లు చూపించారు. కోవిడ్ వ‌ల్ల ఆంక్ష‌లు, స‌డ‌లింపులు ఎక్కువ కావ‌డంతో మా వ్యాపారాలు దెబ్బ తింటున్నాయ‌ని.. కొంత స‌డ‌లింపులు ఇవ్వాల‌ని కోర‌గా కలెక్ట‌ర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డం అంటే అంత సులువు కాద‌ని అన్నారు. వ్యాపారులు కోరిన కోరిక‌పై ప్రకాశం జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఏకంగా సినిమా చూపించారు. మీకు ఎవ‌రికి అయినా ఆస‌క్తి ఉంటే ఎవ‌రికి వ‌చ్చిన ఒక రోజు నా క‌లెక్ట‌ర్ కుర్చీలో కూర్చోవాల‌ని... మీరేం చేస్తారో చూద్దాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

అర్జున్ - శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన ఒకే ఒక్క‌డు సినిమాను త‌ల‌పించేలా క‌లెక్ట‌ర్ వ్యాఖ్య‌లు చేయ‌డంతో వారంతా ఒక్క‌సారిగా షాక్ తిన్నారు. జిల్లా కేంద్ర‌మైన ఒంగోలులో వారం రోజులుగా క‌రోనా కేసులు తీవ్రంగా ఉండ‌డంతో అక్క‌డ చాలా క‌ఠినంగా లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నారు. దీంతో వ్యాపారులు తాము ఇబ్బంది ప‌డుతున్న విష‌యాన్ని క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకురాగా... పై వ్యాఖ్య‌లు చేయ‌డంతో పాటు మీలో ఎవ‌రు అయినా ఒక రోజు క‌లెక్ట‌ర్‌గా ప‌ని చేసి క‌రోనా క‌ట్ట‌డి చేసి చూపించాల‌ని స‌వాల్ విసిరారు. ఇది సినిమా కాదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా తాను ముందుకు వెళ్లాల్సి ఉందని భాస్క‌ర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: