ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తర భారతదేశంలోని బీహార్ సహా మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎగువున పడుతున్న వర్షాలతో పెద్ద ఎత్తున వరదలు కూడా సంభవిస్తున్నాయి. తాజాగా బీహార్ లో వరదలు చుక్కలు చూపించాయి. 

 

భారీ వర్షాలు మరియు వరదలతో భగల్పూర్ జిల్లాలోని నౌగాచియా ప్రాంతంలో కోషి నదిలో పాఠశాల భవనం కూలిపోయింది. వరద వస్తున్న సమయంలో ఆ తాకిడి తట్టుకోలేక స్కూల్ భవనం కొట్టుకుపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీహార్  రాష్ట్రంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో  కూడా భారీ వర్షాలు పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: