ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఏ మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక్క రోజే 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కోటీ 32 లక్షల మందికి కరోనా సోకింది. ఈ కేసులు అమెరికా బ్రెజిల్ భారత్ లో భారీగా పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. 

 

ఈ మూడు కూడా జనాభా పరంగా ఎక్కువగా ఉన్న దేశాలే. 1,32,38,121 మందికి కరోనా సోకింది. ప్రపంచ వ్యాప్తంగా 5,75,545 మంది ప్రాణాలు కోల్పోయారు. 76,98,371 మంది కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు ఇప్పుడు. అమెరికాలోని న్యూజెర్సీ, న్యూయార్క్ లో కరోనా కేసుల తీవ్రత చాలా అధికంగా ఉంది. 35 లక్షల దిశగా కరోనా కేసులు వెళ్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: