దేశంలో కరోనా కేసులు ఏ రేంజ్ లో పెరిగిపోతున్నాయో అందరికీ తెలిసిందే.  దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 9,06,752కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 23,727కి పెరిగింది. 3,11,565 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,71,460 మంది కోలుకున్నారు.  మార్చి నెల 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. దాంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రాకపోకలు అన్నీ బంద్ అయ్యాయి.  దాదాపు రెండు నెలల వరకు బస్సులు రోడ్డెక్కలేదు.

 

ఇటీవల లాక్ డౌన్ సడలించిన తర్వాత బస్సులు  రోడ్డెక్కాయి. ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తుంది.  ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌-కర్ణాటక మధ్య అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేయాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. కరోనా అన్ లాక్ మొదలైన తర్వాత ఏపీ నుండి పక్క రాష్ట్రాలకు మొదట కర్నాటకకే బస్సులు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే నెల రోజులు తిరగకముందే కర్నాటకకు బస్సులు నిలిపేయాల్సి వచ్చింది.

 

రేపు రాత్రి నుంచి కర్ణాటకకు సుమారు 140 బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. కర్ణాటకలో కరోనా వ్యాప్తి తగ్గిపోయి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతనే ఏపీ బస్సులు నడుపుతామని ఈడీ చెప్పారు. అయితే ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ చేస్తామని బ్రహ్మానంద రెడ్డి తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: