జైపూర్‌లోని ఫెయిర్‌ మాంట్ హోటల్‌లో జరుగుతున్న కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సిఎల్‌పి) సమావేశంలో పాల్గొన్న 104 మంది ఎమ్మెల్యేలు సచిన్ పైలట్‌ను పార్టీ నుంచి తొలగించాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఆయన పార్టీ వ్యతిరేక కాకర్యక్రమాలకు పాల్పడ్డారు అని చెప్తూ ఆయన పార్టీ నుంచి తప్పించాలి అని కోరారు. 

 

ఇదిలా ఉంటే సిఎం గా ఎవరు ఉన్నా పర్వాలేదు గాని అశోక్ మాత్రం వద్దు అని సచిన్ డిమాండ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అశోక్ గెహ్లాట్ వర్గం మాత్రం ఆయన కాంగ్రెస్ లో వద్దు అని డిమాండ్ చేస్తుంది. దీనితో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు రెండు వర్గాలతో సంప్రదింపులు జరుపుతుంది. సచిన్ మాత్రం అశోక్ ని తప్పిస్తే మాత్రమే తాను పార్టీలోకి వస్తా అని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే సచిన్ పైలెట్ డిమాండ్ ని పార్టీ పెద్దలు లైట్ తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: