అమెరికా యుద్ధ నౌక లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది భారీగా షిప్లో మంటలు రావటంతో  షిప్ లో పేలుడు సంభవించినట్లు అధికారులు గుర్తించారు. అమెరికాలోని యూఎస్ఎస్  అండ్  రిచర్డ్ యుద్ధ నౌకలో  ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 60 మంది గాయపడినట్లు సమాచారం. యుద్ధనౌకలో  చెలరేగిన మంటలను ఆర్పేందుకు... రెండు రోజుల నుంచి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

 


 అమెరికా నౌకాదళంలో  ప్రస్తుతం అగ్ని ప్రమాదానికి గురైన యుద్ధనౌకను సెకండ్ ర్యాంకు తో పోలుస్తారు. దీని పొడుగు 257 మీటర్లు ఉంటుంది. అయితే రెగ్యులర్ మెయింటెనెన్స్ లో భాగంగా ఈ యుద్ధ  నౌకను సాన్ డియాగో  షిప్ యార్డులో  ఆపగా ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక ప్రమాద సమయంలో షిప్లో 160 మంది మాత్రమే ఉండటంతో వారిని తొందరగా నౌక నుంచి తరలించ గలిగామని 60 మందికి గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: