రాజస్థాన్లో రాజకీయ పరిణామాలు అంతకంతకు వేడెక్కుతున్నాయి. ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. సచిన్ పైలెట్ కాంగ్రెస్ పై తిరుగుబాటు చేయడంతో ప్రస్తుతం రాజస్థాన్ ప్రభుత్వం లో సంక్షోభం నెలకొంది అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం సచిన్ పైలెట్ ను  ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అటు వెంటనే భారతీయ జనతా పార్టీ స్పందించింది. 

 

 సచిన్ పైలెట్ ను బిజెపి లోకి ఆహ్వానిస్తున్నట్లు ఆ పార్టీ నేత ఓం మాథుర్   ప్రకటించడం సంచలనం గా మారిపోయింది. బీజేపీ విధివిధానాలు నచ్చిన వారు ఎవరైనా బిజెపి లోకి రావొచ్చునని... ఆయన స్పష్టం చేశారు, అదే సమయంలో ముఖ్యమంత్రిగా గెహ్లాట్  తనకు సంపూర్ణ మద్దతు ఉందని ప్రకటించిన  నేపథ్యంలో అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సిందే  అంటూ సవాల్ విసిరారు. అయితే ఇప్పుడు వరకు బిజెపి లో చేరను అని చెప్పిన  సచిన్  పైలట్  ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చర్యతో ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: