తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన బులిటెన్ లో  తెలుగు రాష్ట్రాలు అప్పులు తీసుకోవడం లో ఎంతగా పోటీ పడుతున్నాయి అన్నది స్పష్టంగా అర్థమవుతుంది . ఏకంగా అప్పులు తీసుకోవడం లో తెలుగు రాష్ట్రాలు టాప్ టెన్ లో చోటు సంపాదించుకోవడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే తెలంగాణాలో 38 శాతం అప్పుల భారం పెరిగినట్లు తాజాగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదికలో  వెల్లడయింది. 

 


 ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే  గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 42% అప్పుల భారం పెరిగినట్లు తాజా నివేదిక చెబుతోంది, రెండు తెలుగు రాష్ట్రాలు రిజర్వు బ్యాంకు దగ్గర అప్పులు తీసుకోవడం లో టాప్ టెన్ లో పోటీ పడుతున్నాయి. ఇక తాజాగా రిజర్వు బ్యాంకు విడుదలచేసిన నివేదికలో తెలంగాణ రాష్ట్రం 9వ స్థానంలో ఉండగా... ఈ ఏడాది  ఆరవ స్థానంలో ఉంది. గత ఏడాది ఏపీ ఆరవ స్థానంలో ఉండగా ఈ ఏడాది మూడో స్థానానికి ఎగబాకినట్లు  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: