ఢిల్లీలో శర వేగంగా వ్యాప్తి చెందుతున్న మహమ్మారి వైరస్ అధికారులను సైతం ఆస్పత్రి పాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీలోని రైల్వే శాఖ ప్రధాన కార్యాలయం లో కరోనా కలకలం రేపింది. దీంతో ఢిల్లీ రైల్వే శాఖ ప్రధాన కార్యాలయాన్ని మూసివేశారు. రైల్వే శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు అధికారులకు  ఇటీవల కరోనా  నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ అని వచ్చింది. ఈ నేపథ్యంలో రైల్ భవన్ రెండు రోజులపాటు మూసివేయనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. 

 

 ఈ నెల 9, 10, 13 తేదీల్లో  రాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో.., రైల్వే శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు అధికారులు   కరోనా  వైరస్ బారిన పడ్డట్లు తేలిందని అధికారులు ప్రకటన చేశారు, ఈ నేపథ్యంలో 14, 15 తేదీలలో రైల్ భవన్ మూసివేసి శానిటైజేషన్  చేయాలని నిర్ణయించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: