ఒక పక్క కరోనా వైరస్ తో గాంధీ ఆస్పత్రి మీద విమర్శలు వస్తున్న సమయంలో గాంధీ ఆస్పత్రిలో ఇప్పుడు అవుట్ సోర్సింగ్ సిబ్బంది నిరసన తల నొప్పిగా మారింది ప్రభుత్వానికి. గాంధీ ఆస్పత్రిలో ఉమ్మడిగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్ లు పరిష్కరించాలి అని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

 

నర్సులు నాలుగో తరగతి ఉద్యోగులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం దిగి వచ్చి తమ డిమాండ్ లు పరిష్కరించలేదు అంటే మాత్రం ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.  ఇప్పటికే నర్సుల కొరతతో ఇబ్బంది పడుతున్న గాంధీ ఆస్పత్రిలో ఈ పరిణామం పెద్ద తల నొప్పిగా మారింది. మంత్రి ఈటెల రాజేంద్ర రంగంలోకి దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: