ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా  వైరస్ విజృంభిస్తున్న వేల నిరుద్యోగం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అందరూ తమ ఉద్యోగులను తగ్గించుకుంటూ వస్తున్న  నేపథ్యంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మాత్రం నిరుద్యోగులు అందరికీ శుభ వార్త చెప్పింది. దేశవ్యాప్తంగా మొత్తం 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించ పోతున్నట్టు తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రకటన చేసింది. 

 

 ఈ 40 వేల ఉద్యోగాల ఎంపిక క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉంటుందని స్పష్టం చేసింది. గత త్రైమాసికంలో సంస్థ ఆదాయం తగ్గినప్పటికీ ఉద్యోగ నియామకాలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తగ్గించబోము  అంటూ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తెలిపింది. కేవలం భారతదేశంలోనే కాకుండా అమెరికాలో కూడా ప్లేస్మెంట్స్ పెంచాలని ఆలోచనలో ఉన్నామని తెలిపింది. అమెరికాలో కూడా రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: