రాజస్థాన్ రాజకీయాలు వాడివేడిగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలె రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ పార్టీలో తిరుగుబాటు చేయడంతో రాజస్థాన్ ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం డిప్యూటీ సీఎం పదవి నుంచి... కాంగ్రెస్ పార్టీ నుంచి సచిన్ పైలెట్ ను తొలగిస్తు నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 

 

 అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పిస్తూ కాంగ్రెస్ తీసుకున్న కీలక నిర్ణయం పై సచిన్ పైలెట్ స్పందించారు. సత్యాన్ని వక్రీకరించగలరేమో  కానీ ఓడించలేరు అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు సచిన్ పైలెట్. అయితే పార్టీ మారే విషయంపై మాత్రం సచిన్ పైలెట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈరోజు సాయంత్రం లోపు సచిన్ పైలెట్ ఆయన రాజకీయ భవిష్యత్తు పై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు రాజస్థాన్ రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: