ఈ మద్య తెలంగాణలో వరుసగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా  జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి.  ఇటీవల లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి కరోనా కేసులు పెరిగిపోతున్నాయని అంటున్నారు అధికారు. అయితే కరోనా వచ్చినంత మాత్రాన ప్రాణభయంతో పరుగులు తీయాల్సిన అవసరం లేదని.. సరైన వైద్య చికిత్స.. ఆహారం తీసుకుంటే కరోనా నుంచి బయట పడవొచ్చని అంటున్నారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.  మన దేశ జనాభా ఎక్కువ కనుక కేసులు సంఖ్య అలా కనిపిస్తుంది. 

 

కొంత మంది మీడియాలో పనికట్టుకొని మరీ నెగిటీవ్ ప్రచారాలు చేస్తున్నారని.. దాంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని... అందుకే కరోనా రోగిని వెలివేసే విధానం సమాజంలో ఏర్పడిందని అజయ్ తెలిపారు.  కరోనా విషయంలో ప్రభుత్వాల వైఫల్యం ఉండదని, ఈ అంశంపై విపక్ష పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇక తెలంగాణలో రికవరీ రేటు ఎక్కువగా ఉందని, ఇదే సమయంలో మరణాల రేటు తక్కువగా ఉందని చెప్పారు.

 

కరోనా విషయంలో అలర్ట్ చేయండంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తనకు కరోనా వచ్చినా భయపడనని... గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతానని చెప్పారు. విపక్షాలంటే ప్రజలకు మద్దతుగా ఉండాలి.. అంతే కానీ ప్రజలను అపోహలకు గురి చేస్తూ లబ్ధి పొందడం శోచనీయం అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: