పారిశ్రామిక దిగ్గజం అయిన ముఖేష్ అంబానీ కంపెనీ అయినా జియో  ప్లాట్ ఫార్మ్ ఇటీవలే పెట్టుబడులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా జియో  ఫ్లాట్ఫామ్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ని సైతం ఆకర్షించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జియో  ప్లాట్ ఫార్మ్ లో  గూగుల్ ఏకంగా 4 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఒప్పందానికి సంబంధించి కొద్ది వారాల్లో మరికొన్ని వివరాలు వెల్లడి కానున్నట్లు మార్కెట్ వర్గాల్లో  ఊహాగానాలు వెలువడుతున్నాయి. 

 


 ఇటీవలే 5 నుంచి ఏడేళ్ల కాలంలో దేశీయంగా 10 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు గూగుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జియో ప్లాట్ ఫార్మ్ లో 4 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జియో లో పెట్టుబడులపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఎంతో స్పీడ్ తో దూసుకుపోతున్న జియో  గూగుల్ ఒప్పందంతో మరింత వేగం పుంజుకొకోనున్నట్లు  నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: