బిజెపి ఎంపీ సుజనా చౌదరి లక్ష్యంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సుజనా చౌదరి.. నిన్ను టార్గెట్ చేయాలంటే తలకిందులుగా తపస్సు చేయాలా ? అంటూ ప్రశ్నించారు. నీలాంటి చౌకబారు శరణార్ధులని మేము అసలు లెక్క చేయమన్నారు ఆయన. ముందు నీవు తలకిందులుగా తపస్సు చేయ్..
బాబు కోవర్ట్ అనే ముద్ర చెరుపుకోవడానికి అంటూ ఆయన ఎద్దేవా చేసారు. సుజనా చౌదరి మాటలు విని కొందరు బిజెపి నాయకులు నవ్వుకుంటున్నారన్నారు. జూనియర్ ఆర్టిస్ట్ వేషం వేసి.. మొత్తం ఇండస్ట్రీనే పెంచి పోషిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చే కమెడియన్ ని గుర్తు తెచ్చుకుంటూ... కెమరా ముందుకు వచ్చినపుడే కాషాయం అని.. మేకప్ తీస్తే ఒరిజినల్ పసుపు అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
సుజనా చౌదరి మాటలు విని కొందరు బిజెపి నాయకులు నవ్వుకుంటున్నారు. జూనియర్ ఆర్టిస్ట్ వేషం వేసి.. మొత్తం ఇండస్ట్రీనే పెంచి పోషిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చే కమెడియన్ ని గుర్తు తెచ్చుకుంటూ. కెమరా ముందుకు వచ్చినపుడే కాషాయం. మేకప్ తీస్తే ఒరిజినల్ పసుపు.
— Vijayasai reddy v (@VSReddy_MP) July 14, 2020
సుజనా చౌదరి .. నిన్ను టార్గెట్ చేయాలంటే తలకిందులుగా తపస్సు చేయాలా ? నీలాంటి చౌకబారు శరణార్ధులని మేము అసలు లెక్క చేయము. ముందు నీవు తలకిందులుగా తపస్సు చేయ్ . బాబు కోవర్ట్ అనే ముద్ర చెరుపుకోవడానికి.
— Vijayasai reddy v (@VSReddy_MP) July 14, 2020