దేశ వ్యాఫంగా కరోనా రికవరీ రేటు పెరుగుతుందని అదే విధంగా కేవలం 10 రాష్ట్రాల్లోనే 86 శాతం కరోనా కేసులు ఉన్నాయి అని కేంద్ర ఆర్యగ్య శాఖ ఓఎస్డీ రాజేష్ భూషణ్ వివరించారు. మొత్తం కేసులలో 86% 10 రాష్ట్రాలకు పరిమితం అయ్యాయి అని అన్నారు. 

 

వీటిలో రెండు రాష్ట్రాలు తమిళనాడు, మహారాష్ట్రలో 50% కేసులు ఉన్నాయని ఆయన అన్నారు. మరో ఎనిమిది రాష్ట్రాలలో 36% కేసులు ఉన్నాయని ఆయన వివరించారు. దేశంలో మొత్తం 1400 ల్యాబ్ ల ద్వారా పరిక్షలు చేస్తున్నామని ఆయన అన్నారు. యాక్తీవ్ కేసులతో పోలిస్తే రికవరీ కేసులే ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో కరోనా కేసుల ఉదృతి తగ్గింది అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: