కరోనా టెస్ట్ లు, వైద్య చికిత్సపై తెలంగాణా హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణా హైకోర్ట్ కీలక వ్యాఖ్య చేసింది. గాంధీ ఆస్పత్రిలో కరోనా పరిక్షలు ఎందుకు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గాంధీ ఆస్పత్రిలో కరోనా పరిక్షలు చేయాల్సిందే అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 

 

కేంద్రం కల్పించిన అధికారాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు సంబంధించిన ఫీజులను నియంత్రించాలి అని స్పష్టం చేసింది. 4 లక్షల వరకు ఫీజు వసూలు చేసిన యశోదా కిమ్స్ పై ఏ చర్యలు తీసుకున్నారు అని ప్రశ్నించింది. నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో కరోనా పరిక్షలు చేస్తారా అని ప్రశ్నించింది. ఈ నెల 27 లోగా నివేదిక ఇవ్వాలి అని తెలంగాణా  ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంటిలేటర్ లు బెడ్స్ పై కచ్చితంగా ప్రచారం చెయ్యాలని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: