మేలో, రికవరీ రేటు 26 శాతంగా ఉంది, ఇది మే చివరి నాటికి 48 శాతానికి పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ ఓఎస్డీ రాజేష్ భూషణ్ మీడియాకు వివరించారు. దేశంలో జూలై 12 నాటికి 63 శాతానికి రికవరీ రేటు పెరిగింది అని కేంద్రం వివరించింది. జాతీయ రికవరీ రేటు కంటే 20 రాష్ట్రాల్లో రికవరీ రేట్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన వివరించారు. 

 

మే 2 నుండి మే 30 వరకు, కోలుకున్న కేసుల కంటే క్రియాశీల  కరోనా కేసుల సంఖ్య ఎక్కువ గా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ తరువాత, క్రియాశీల మరియు కోలుకున్న కేసుల సంఖ్య మధ్య వ్యత్యాసం పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ రోజు, కోలుకున్న కేసుల సంఖ్య ఆక్టివ్ కేసుల కంటే 1.8 రెట్లు ఎక్కువ అని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: