దేశంలో కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిందే. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు దేశానికి వ్యాక్సిన్ అనేది చాలా అవసరంగా మారింది. కరోనా వ్యాక్సిన్ లేకుండా  ఇప్పుడు పని జరిగే అవకాశం లేదని ప్రపంచం మొత్తానికి అర్ధమవుతుంది. 

 

ఈ నేపధ్యంలో ఐసిఎంఆర్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. 2 భారతీయ తయారి టీకాలు ఉన్నాయని ఐసిఎంఆర్ డీజీ బలరాం భార్గవ వెల్లడించారు. వారు ఎలుకలు మరియు కుందేళ్ళలో విజయవంతమైన పరిక్షలు చేసారని అన్నారు. డిసిజిఐకి డేటా సమర్పించామని చెప్పారు. ఈ రెండూ ఈ నెల ప్రారంభంలో మొదటి దశ హ్యూమన్ ట్రయల్స్ న్ని ప్రారంభించడానికి క్లియరెన్స్ పొందాయని బలరామ్ భార్గవ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: