కరోనా యాంటి వైరల్ డ్రగ్స్ విషయంలో  ఎన్ని హెచ్చరికలు చేసినా సరే కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఆస్పత్రులకు తరలించాల్సిన యాంటి వైరల్ డ్రగ్స్ ని కొన్ని గ్యాంగ్ లు పక్కదారి పట్టిస్తున్నాయి. యాంటీ వైరల్ డ్రగ్స్ అంటూ ప్రచారం చేస్తూ విక్రయించడం మొదలు పెట్టారు. అనుమతులు లేకుండా యాంటీ వైరల్ డ్రగ్స్ ని అమ్ముతున్నారు హైదరాబాద్ లో . 

 

రూ 30 వేలు ఉన్న మందులను 2 లక్షల వరకు విక్రయిస్తున్నారు. తాజాగా యాంటీ వైరల్ డ్రగ్స్ అమ్ముతున్న ఒక ముఠా గుట్టు ని టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేసారు. దాదాపు 35 లక్షల వరకు విలువ చేసే యాంటీ వైరల్ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా 34 ఆక్సీజన్ సిలెండర్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: