కరోనా మహమ్మారి తీవ్రతకు ఏపీ గజగజ వణికిపోతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రమే కాదు, మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతుండడం అధికార వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 43 మంది మృత్యువాత పడ్డారు. ఒక్కరోజే ఇంతమంది మరణించడం ఇదే ప్రథమం. రాష్ట్రవ్యాప్తంగా మరో 1,916 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 238 కేసులు రాగా, శ్రీకాకుళం జిల్లాలో 215 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మొత్తమ్మీద పాజిటివ్ కేసుల సంఖ్య 33,019కి పెరిగింది. తాజాగా, 952 మందిని డిశ్చార్జి చేశారు. ఇంకా 15,144 మంది చికిత్స పొందుతున్నారు. 

 

కరోన మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 144 సెక్షన్ అమల్లో ఉందని  పెద్దాపురం పట్టణ, మండల పరిధిలో అన్ని గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ప్రజలకు బయట తిరిగే అనుమతి ఉందని అదేవిధంగా అన్ని షాపులు  11 గంటల వరకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది అని అన్నారు.

 

పెద్దాపురం పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉందని ప్రజలు గుంపులు గుంపులు గా బయట తిరగకూడదు అని హెచ్చరించారు.  నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బయటకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మాస్కు తప్పనిసరిగా ఉండాలని లేనివారికి జరిమానా విధిస్తాం అని తెలిపారు.  ఎవరైనా అత్యవసర పనులపై బయటకు వస్తే.. తప్పని సరి మాస్క్ ధరించాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: