ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా కరోనా తో  మృతి చెందితే అంత్యక్రియల కోసం బాధిత కుటుంబానికి 15 వేల రూపాయలు అందించాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. మంగళవారం రాష్ట్రంలో కరోనా  నియంత్రణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... ఏ ఆస్పత్రిలో అయితే కరోనా బాధితుల చికిత్సకు  నిరాకరిస్తున్నారో  ఆ ఆస్పత్రిల రద్దుకు వెనకాడ  వద్దు అంటూ అధికారులకు సూచించారు. 

 

 వచ్చే వారం రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... క్రమం తప్పకుండా అన్ని ఆస్పత్రులను సందర్శించాలన్నారు . రాష్ట్రంలోనే కంటెంట్మెంట్ క్లస్టర్లలో ప్రత్యేక బస్సుల ద్వారా పరీక్షలు నిర్వహించాలి అంటూ అధికారులకు సూచించారు సీఎం జగన్. క్వారంటైన్ కేంద్రాల్లో వసతులు భోజనం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: