మున్సిపాలిటీలో ఖాళీలపై తాజాగా మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పురపాలికల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బందిని హేతుబద్ధీకరణ చేసి.. ఆ తర్వాత పట్టణ ప్రజల అవసరాల మేరకు నూతన సిబ్బంది నియామక ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పెరుగుతున్న పట్టణీకరణ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా.. భవిష్యత్తులో సిబ్బందిని కేటాయించనున్నట్లు కేటిఆర్ చెప్పుకొచ్చారు. 

 

 కొత్త నియామకాల్లో ఇంజనీరింగ్ మౌలిక సదుపాయాలు కల్పించే విభాగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది అంటూ తెలిపిన కేటీఆర్.. నూతన పురపాలక చట్టం నియమ నిబంధనల మేరకే ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సిబ్బంది హేతుబద్ధీకరణ పై అధికారులకు పలు సూచనలు సలహాలు కూడా ఇచ్చారు మంత్రి కేటీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: