రాజ‌స్థాన్‌లో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ ఉప ముఖ్య‌మంత్రి స‌చిన్ పైలెట్‌తో పాటు ఆయ‌న వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు మంత్రుల‌ను తొల‌గించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అక్క‌డ  వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను బీజేపీ అధిష్ఠానం నిశితంగా గమనిస్తోంది. ఇప్ప‌టికే క‌ర్నాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో అందివ‌చ్చిన అవ‌కాశం వాడుకున్న బీజేపీ అక్క‌డ త‌మ ప్ర‌భుత్వాలు ఏర్పాటు చేయ‌గ‌లిగింది. 

 

ఈ క్ర‌మంలోనే రాజ‌స్థాన్‌లోనూ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ వ‌స్తే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షాలకు అత్యంత సన్నిహితుడైన కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌కు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి పీఠం కట్ట‌బెడ‌తార‌ని అంటున్నారు. అయితే అదే స‌మ‌యంలో త‌న‌తో ఎప్పుడూ ఉప్పు నిప్పుగా ఉండే రాజ‌స్థాన్ మాజీ ముఖ్య‌మంత్రి వసుంధరా రాజే కు మోదీ, షా ఇలా చెక్ పెట్టేస్తున్నార‌న్న ప్ర‌చారం కూడా బీజేపీ జాతీయ వ‌ర్గాల్లో ప్రారంభ‌మైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: