ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. గత కొన్ని రోజులుగా ఏపీలో కొత్త జిల్లాల గురించి చర్చ జరుగుతోంది. నేడు జరగబోయే సమావేశంలో ఈ అంశంపై ముందడుగు పడే అవకాశం ఉంది. మొత్తం 20 అంశాల‌పై కేబినెట్ చ‌ర్చించ‌నుండ‌గా కొత్త జిల్లాల ఏర్పాటు గురించి జ‌గ‌న్ స‌ర్కార్ ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. 
 
జగన్ సర్కార్ ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఓ జిల్లా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇసుక కొరత తీర్చేందుకు ఉప‌క‌రించే చర్యల గురించి, రాజధానుల ఏర్పాటు.. తరలింపు అంశంతోపాటు.. కొత్తగా అమలు చేయాల్సిన సంక్షేమ పథకాల గురించి కేబినెట్ చర్చించనుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేపట్టిన నాడు నేడు కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలపనుందని సమాచారం. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: