ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ‌పై మ‌రోసారి క‌ద‌లిక మొద‌లైంది. ముందుగా జిల్లాల ఏర్పాటుకు కావాల్సిన విధివిధానాలు ఖ‌రారు చేసేందుకు ఉన్న‌త స్థాయి క‌మిటీ ఏర్పాటు చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇప్ప‌టికే రెవెన్యూ శాఖ ప్ర‌క్రియ ప్రారంభించింది. జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాత్రం ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తాన‌ని చెప్పారు. అయితే ఈ ప్ర‌క్రియ‌లో ప్ర‌తిపాద‌న‌లు ప‌రిశీలించాక అనేక ఇబ్బందులు ఉన్నాయ‌న్న‌ది జ‌గ‌న్ దృష్టికి వ‌చ్చింది.

 

కొన్ని జిల్లాల‌ను లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా విభ‌జించేందుకు సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే ఒప్పుకోవ‌డం లేదు. ఇక కొత్త ప్ర‌తిపాద‌న‌ల త‌ర్వాత‌ ఊహించిన దానికంటే జిల్లాల సంఖ్య 27 దాకా వస్తున్నట్లు తెలిసింది. 2 గిరిజన జిల్లాలను ఏర్పాటు చేయాలని కొన్ని లెక్కలను చూపించారు. ఇక శ్రీకాకుళం జిల్లా మూడు ముక్క‌లు కానుంది. దీనినిని సొంత పార్టీ నేత‌లే ఒప్పుకోవ‌డం లేదు. చిత్తూరు, క‌డ‌ప జిల్లాల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. మ‌రి జ‌గ‌న్ జిల్లాల విభ‌జ‌న‌లో ఏం చేస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: