అమెరికాలో కరోనా వ్యాప్తి ఏమో గాని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం పదే పదే చైనాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన మారోసారి విమర్శలు చేసారు. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థమీద కూడా ఆరోపణలు చేసారు. వారు  నిజంగా చైనా యొక్క తోలుబొమ్మ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థను ఉద్దేశించి అన్నారు. వారు తప్పు చేయవద్దని... వైరస్ ను దాచే ప్రయత్నం చేయవద్దు అని అన్నారు. 

 

ప్రపంచం ముందు రహస్యం బయట పెట్టాల్సిన బాధ్యత చైనా  మీద ఉందన్నారు. అదే విధంగా మేము తాము చైనా టెక్నాలజీ  నమ్మడం లేదని అన్నారు. హువావేని ఉపయోగించవద్దని మేము చాలా దేశాలను ఒప్పించామన్నారు. ఎందుకంటే ఇది పెద్ద భద్రతా ప్రమాదమని ఆయన చెప్పుకొచ్చారు. యుకె నేడు వాడటం లేదని ప్రకటించింది అన్ని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: