అమెరికాలో నివాసం ఉంటూ ఆన్లైన్ క్లాసుల్లో పాల్గొనే విద్యార్ధులు అమెరికా నుంచి వెళ్ళాలి అని ఆదేశాలు ఇచ్చిన ఆ దేశ అధ్యక్షుడు  డోనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ఈ నిర్ణయంపై ముందు నుంచి తీవ్ర విమర్శలు రాగా ... ట్రంప్ నిర్ణయంపై రాష్ట్రాలు, అదే విధంగా వర్సిటీ లు  కోర్ట్ లకు వెళ్ళాయి. వ్యవహారం కాస్త తేడాగా ఉండటంతో ఆయన వెనక్కు తగ్గినట్టు తెలుస్తుంది. 

 

అదే విధంగా  విద్యార్ధులకు ఎవరికి ఏ ఇబ్బంది లేదు అని ఆయన తాజాగా ప్రకటించారు. కాగా పది లక్షల మందిపై ట్రంప్ నిర్ణయం పడేది. చైనా విద్యార్ధులను టార్గెట్ గా చేసుకుని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని కాని భారత్ సహా పలు దేశాలు తీవ్రంగా నష్టపోయే అవకాశముందని నిపుణులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: