తెలంగాణా సచివాలయం కూల్చివేత విషయంలో మరొకరు కోర్ట్ కి వెళ్ళారు. భవనలను కూల్చి వేయడంతో దాదాపు 5 లక్షల మంది శ్వాస సంబంధిత ఇబ్బందులు వస్తాయి అని ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రాష్ట్ర హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. అన్ని అనుమతులు తీసుకుని సచివాలయ భవనాల కూల్చివేత పనులు మొదలు పెట్టామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 

 

ఇటీవల తెలంగాణా సచివాలయం కూల్చివేతకు రెండు మూడు రోజుల  పాటు హైకోర్ట్ తాత్కాలికంగా బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కూల్చివేత విషయంలో ట్రాఫిక్ సమస్యలు కూడా వస్తున్నాయి. ట్రాఫిక్ ని అధికారులు ఇతర ప్రాంతాలకు మళ్ళించడం పై విమర్శలు వస్తున్నాయి. స్థానికంగా ఉన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: