దేశ రాజధాని ఢిల్లీ లో జూన్ 1 న 4,100 పడకలు మాత్రమే ఉన్నాయని ఆ రాష్ట్ర సిఎం అరవింద్ కేజ్రివాల్ అన్నారు. తాజాగా ఆయన తన కార్యాలయంలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. నేడు 15 వేల కరోనా పడకలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. 

 

కరోనా చికిత్స చాలా వేగంగా చేస్తున్నామని ఆయన అన్నారు. నేడు 2,100 ఐసియు పడకలు ఉన్నాయని... వాటిలో 1,100 ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఈ కారణంగా, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉంటే, పడకల కొరత ఉండదు అనే నమ్మకం ఈ రోజు ప్రజలకు ఉందని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు. కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్నాయని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: