తిరుమలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజుకి అక్కడ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు సర్వత్రా కూడా ఆందోళన మొదలయింది. ఇక తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో తర్జన భర్జన నెలకొంది. వాస్తవానికి దర్శనాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది లేదు అని చెప్తుంది. టీటీడీ అధికారులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. 

 

అయితే అలిపిరి టెస్టింగ్ పాయింట్ లో ఉండే అధికారులకు కరోనా వచ్చింది. వైద్యులకు టెక్నీషియన్ కి కరోనా సోకింది. దీనితో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం పరిపాలనా భవనంలో ఇప్పుడు టీటీడీ అధికారులు జిల్లా కలెక్టర్ తో సమావేశం అయి పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. దీనిపై ఏదోక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తిరుమలలో ఉండే స్థానికులకు కూడా కరోనా సోకింది.

మరింత సమాచారం తెలుసుకోండి: