సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) 10 వ తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 91.46%  అని బోర్డు పేర్కొంది. ఇటీవల క్లాస్ 12 కి ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.  నేడు వీటిని విడుదల చేసింది బోర్డు. విద్యార్థులు ఫలితాలను results.nic.in,  cbseresults.nic.in, cbse.nic.in వెబ్‌సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు. 

 

ఇటీవల సీబీఎస్ఈ పరీక్షలు, ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నా సరే విద్యార్ధులకు ఏ ఇబ్బందులు రాకుండా విడుదల చేసారు. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పేపర్ల మూల్యాంకనం జరిగింది. 12వ తరగతి మాదిరిగా 10వ తరగతి ఫలితాల్లో మెరిట్ లిస్ట్ విడుదల చేయలేదు బోర్డ్.

మరింత సమాచారం తెలుసుకోండి: