కొత్త జిల్లాల ఏర్పాటు పై తాజాగా ఏపీ మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వెలగపూడి సచివాలయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. ఇందులో బాగాంగానే  కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అధ్యయన కమిటీ ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. 

 

 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటు చేయనుంది జగన్ సర్కార్. వచ్చే ఏడాది మార్చి 31లోగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయాలంటూ క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గం సరిహద్దుగా కొత్త జిల్లాల ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు జగన్ సర్కార్  కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: