ఆన్లైన్లో క్లాసులకు హాజరయ్యే  విదేశీ  విద్యార్థులకు ఇటీవలే వీసాలు రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. పలు రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులను కూడా ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం విషయంలో ట్రంపు సర్కారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. 

 

 తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా ప్రభుత్వం. ఇటీవలే ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యి విదేశీ విద్యార్థులకు వీసాలు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయంతో ఎంతో మంది విదేశీ విద్యార్థులకు ఊరట కలగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: