సిద్దిపేట జిల్లా కేంద్రంలో వంద పడకల తో ఏర్పాటుచేసిన కోవిడ్- 19 ఆసుపత్రిని తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోనే ఐసోలేషన్ వార్డులను వైద్య పరికరాలను పరిశీలించారు మంత్రి హరీష్ రావు. రోగులకు అందించాల్సిన వైద్యంపై ఆసుపత్రి వైద్యులతో  కాసేపు చర్చించారు. 

 

 ప్రస్తుతం హరీష్ రావు ప్రారంభించిన ఆసుపత్రిలో 80 పడకలతో పాటు 20 ఐసీయూ బెడ్స్  కూడా ఉన్నాయి. అయితే ఈ ఆసుపత్రి ప్రారంభం కారణంగా సిద్దిపేట సమీప జిల్లాల వాసులకు కూడా ఎంతో మెరుగైన చికిత్స అందనున్నట్లు తెలుస్తోంది. ఇక రోగులకు చికిత్స అందించడంలో వైద్యులు ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలి అంటూ మంత్రి హరీష్ రావు వైద్యులకు సూచనలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: