దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం ఏమాత్రం తాగగడం లేదు. ఇటీవల లాక్ డౌన్ సడలించిన తర్వాత వలస కూలీలు వివిధ తమ స్వస్థలాలకు చేరుకున్నారు.  అప్పటి నుంచి  రోజుకి సగటున 25వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకి కేసుల సంఖ్యా పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. గత పది రోజులుగా ప్రతిరోజు రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో 29,429 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 582 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9,36,181కు పెరిగింది.

IHG

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,19,840 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా వైరస్ బారినపడిన వారిలో 5,92,032 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ వైరస్‌ వల్ల ఇప్పటివరకు 24,309 మంది మరణించారు.  కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,24,12,664 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,20,161 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: