హైదరాబాద్ వాతావరణం లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత రెండు రోజుల చిరుజల్లు కురిసాయి. కానీ ఈరోజు మధ్యాహ్నం ఉన్నట్టుండి భారీ వర్షం కురవడంతో 30 నిమిషాల వ్యవధిలోనే నగరం మొత్తం నిండుకుండలా మారిపోయింది. ఎక్కడికక్కడ డ్రైనేజీ నాలాలు  జామ్  కావడంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి

 


 లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపునీరు చేరడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక రోడ్ల పైకి నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలకు ఎంతగానో ఇబ్బంది ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం వర్షాలు కురిసి ఎక్కడికక్కడ నీరు  నిలిచిపోయిన నేపథ్యంలో కరోనా  వైరస్ వ్యాప్తిపై   ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: