గాంధీ ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ సిబ్బందితో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు సఫలం అయ్యాయి. కరోనా విధుల్లో ఉన్న నర్సులకు జీతం  పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నర్సులకు 17 వేల 500 నుంచి 25 వేల వరకు జీతం పెంచారు. కరోనా విధుల్లో ఉన్న వారికి 750 డైలీ ఇన్సెంటివ్  ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. 

 

అదే విధంగా నాలుగో తరగతి ఉద్యోగులకు  రోజుకి 300 ఇన్సెంటివ్ అలాగే 15 రోజులు మాత్రమే డ్యూటి కింద అంగీకరించారు. అవుట్ సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ లోకి మార్చేందుకు  ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. దీనితో గాంధీ ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సమ్మె విరమించారు. వారు తక్షణమే విధుల్లో చేరే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: