మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా పని చేసినా సరే అక్కడ కేసులు అసలు ఆగడం లేదు. దీనితో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. అక్కడ లాక్ డౌన్ ని విధించాలి అనే డిమాండ్ లు వస్తున్నాయి. అక్కడ చాలా జిల్లాల్లో లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండో దశ లాక్ డౌన్ ని ప్రకటించింది. 

 

మహారాష్ట్రలో రెండవ దశ లాక్డౌన్ జూలై 18 నుండి జూలై 23 వరకు ఉంటుంది అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మెడికల్ స్టోర్స్, డెయిరీలు, ఆస్పత్రులు మరియు అవసరమైన సేవలు తెరిచి ఉండటానికి అనుమతి ఇచ్చింది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: