భారత్‌లో కొవిడ్‌-19 వైరస్ కేసుల విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 29,429 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 582 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 9,36,181కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 24,309కి పెరిగింది. 3,19,840 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,92,032 మంది కోలుకున్నారు.

 

తాజాగా బోర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ విభాగంలో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 68 మందికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. 48 మంది ఈ వైర‌స్ నుంచి కోలుకున్నారు. గత కొన్ని రోజులుగా డాక్టర్లు, పోలీసులకు కరోనా సోకుతున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఈ మద్య  బీఎస్ఎఫ్ జవాన్లకు కూడా కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,093కు చేరుకోగా యాక్టివ్ కేసుల సంఖ్య 1,024. ఈ వైర‌స్ నుంచి 1,060 మంది జ‌వాన్లు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
      

మరింత సమాచారం తెలుసుకోండి: