కరోనా కేరళలో కట్టడి అయింది అని భావించినా సరే కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అక్కడ లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. పరిక్షల సంఖ్య కూడా చాలా వేగంగా పెంచారు. అయినా సరే కరోనా కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే  తాజాగా మరోసారి అక్కడ భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

 

కేరళలో 623 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర సిఎం పినరై విజయన్ వెల్లడించారు. వీటిలో 157 కేసులు తిరువనంతపురం నుండి వచ్చాయని అన్నారు. 4880 క్రియాశీల కేసులతో సహా మొత్తం కేసుల సంఖ్య 9553 కి చేరుకున్నాయి అని ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ ని అమలు చేస్తున్నామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: