పాకిస్తాన్ భారత్ సరిహద్దులలో ఎప్పటికప్పుడు వాతావరణం కాస్త ఆందోళనకరంగానే ఉంటుంది. పాకిస్తాన్ చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం కూడా పొంతన ఉండదు అనే మాట వాస్తవం. ఇక గత నెల రోజుల నుంచి కూడా సరిహద్దుల్లో పాకిస్తాన్ ఏదోక విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతునే ఉంది. ఈ నేపధ్యంలోనే భారత రక్షణ శాఖ అప్రమత్తం అయింది. 

 

తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర సరిహద్దుల్లో ఉన్న పరిస్థితుల కారణంగా భద్రతా వాతావరణాన్ని పరిశీలిస్తే మన సరిహద్దుల రక్షణ కోసం సాయుధ దళాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిర్ణయించింది. రాజనాథ్ సింగ్ ఆధ్వర్యంలో నేడు  జరిగిన ఒక సమావేశంలో రక్షణ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.  పాక్ వరుసగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: