దేశంలో ఈ మద్య కాలంలో ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువ అయ్యాయి. తాజాగా  యువతుల ఫోటోలను మార్ఫింగ్‌ చేస్తూ వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం పుర్లమెర గ్రామానికి చెందిన చిన్న రఘుబాబు అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.   కేరళలో బీఎస్సీ యానిమేషన్ మల్టీమీడియా పూర్తి చేసి ప్రస్తుతం తన స్వగ్రామంలోనే నివసిస్తూ తనతో చదువుకున్న యువతులతో ఇన్స్టాగ్రామ్, వాట్సప్ ల ద్వారా పరిచయాన్ని పెంచుకొని వారి ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి మీరు న్యూడ్ ఫొటోలు పంపించాలని లేకుంటే మార్ఫింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడు. 

 

దాదాపు 10 మంది మహిళలు ఈయన బారిన పడినట్లు జిల్లా ఎస్పీ విశాల్‌ గున్ని తెలిపారు. ఇన్‌స్ట్రాగామ్‌ నుంచి యువతుల ఫోటోలను తీసి మార్ఫింగ్‌ చేస్తున్నట్లు గుర్తించామని ఆయన వివరించారు.  నకిలీ సిమ్‌ కార్డును కొనుగోలు చేసి అమ్మాయిలకు బెదిరిస్తున్నారని అన్నారు.

 

ప్రజలు ఆన్‌లైన్‌ వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండాలని , వ్యక్తిగత సమాచారం, లోకేషన్‌ ఎవరికి ఇవ్వవద్దని సూచించారు. గత కొద్దిరోజులుగా ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు బుధవారం నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాని వినియోగించే యువతీ, యువకులు  కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: