ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని మరో ఆరు జిల్లాల్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. సీఎం జగన్ రాష్ట్రంలో విద్య, వైద్యం విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందడుగులు వేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 2020 జనవరి నుంచి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని జగన్ సర్కార్ పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. 
 
ఏపీ ప్రభుత్వం నేటి నుంచి ప్రకాశం, గుంటూరు, కడప, కర్నూలు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఆరోగ్యశ్రీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ ఆరు జిల్లాల్లోని ఆస్పత్రుల్లో వైద్య సేవలను ప్రారంభించనున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులను తీసుకొనివెళ్లి ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రుల్లో ఆప‌రేష‌న్స్ చేయించుకుని డిశ్చార్జి అయిన వారికి ప్రభుత్వం నెలకు 5వేల రూపాయల చొప్పున ఆరోగ్య ఆసరా అందించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: