టెలీకాం కంపెనీల మధ్యన భారీ యుద్ధమే జరుగుతోంది. రిలయన్స్ జియో - ఎయిర్టెల్ ల మధ్యన మొదలైన స్వల్ప యుద్ధం చిలికి చిలికి గాలివాన గా మారి ఇప్పుడు ఐడియా , వోడాఫోన్ లు కూడా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తోంది. వినియోగదారులు కొత్త నెట్వర్క్ మారడం కోసం ఈ సంస్థలు ఒప్పుకోవడం లేదు అంటూ జియో ఆరోపిస్తోంది. దేశం లో పెను సంచలనంగా మారిన మొబైల్ నెంబర్ పోర్ట బులిటీ ని ఎయిర్టెల్ , ఐడియా, వోడాఫోన్ లు అడ్డుకుంటున్నాయి అనేది వీరి ప్రధాన ఆరోపణ.వినియోగదారులు ఈ నెంబర్ మార్చుకోవడం గురించి రిక్వస్ట్ లు పెడుతున్నా కూడా ఆయా సంస్థలు వాటిని అడ్డుకోవడం జరుగుతోంది అని వివరిస్తోంది జియో.  పేర్కొంది. యూజర్ల రిక్వెస్టులను ఆయా సంస్థలు నిర్దాక్షిణ్యంగా అడ్డుకుంటున్నాయని తెలిపింది. ఈనెల 9 నుంచి 12వ తేదీ మధ్య కాలంలో నెంబర్ పోర్టబిలిటీ కోసం వినియోగదారులు చేసుకున్న దరఖాస్తులను తిరస్కరించాయని వివరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగులు చేసుకున్న 4,919 రిక్వెస్టులు వీటికి అదనమని పేర్కొంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: