ఐదు రాష్ట్రాల ఎన్నికల దెబ్బకి స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుంది .. ఉత్తర ప్రదేశ్ లో రెండు రోజుల క్రితం బీజేపీ సాధించిన అత్యుత్తమ ఫలితాలు దేశ స్టాక్ మార్కెట్ లలోని ఇన్వెస్టర్ ల సెంటిమెంట్ ని పెంచేశాయి. మార్కెట్ లో బుల్ సెషన్ మొదలయ్యి వెంటనే హైప్ నడిచింది. ముఖ్యంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, దేశవాళీ ఫండ్ సంస్థలు భారీగా పెట్టుబడులను స్టాక్ మార్కెట్ కు తరలించాయి.


దీంతో, క్రితం ముగింపుతో పోలిస్తే, బీఎస్ఈ సెన్సెక్స్ సెషన్ ఆరంభమైన క్షణాల్లోనే 500 పాయింట్లు పెరిగింది. ఉదయం 10 గంటల సమయంలో బీఎస్ఈ సూచిక 477 పాయింట్లు పెరిగి 1.65 శాతం లాభంతో 29,423 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక, 138.65 పాయింట్లు పెరిగి 1.55 శాతం లాభంతో 9.073 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీ-50లోబోషెం, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఆటో మినహా మిగతా అన్ని కంపెనీలూ లాభాల్లో ఉండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: