రిల‌య‌న్స్ జియో. గ‌తేడాది మార్కెట్‌లోకి ప్ర‌వేశించింది. వెల్‌క‌మ్ ఆఫ‌ర్‌, హ్యాపీ న్యూఇయ‌ర్ ఆఫ‌ర్‌, ధ‌న్ ధ‌నా ధ‌న్ ఆఫ‌ర్‌... ఇలా అనేక ర‌కాల ఆఫ‌ర్లను ప్ర‌వేశ‌పెట్టి కొన్ని కోట్ల సంఖ్య‌లో యూజ‌ర్లను ఆక‌ట్టుకుంది. అయితే కేవ‌లం ఆఫ‌ర్ల‌ను ఇవ్వ‌డంలోనే కాదు, రిల‌య‌న్స్ జియో స్పీడ్ ప‌రంగా కూడా దేశంలోనే బెస్ట్ 4జీ నెట్‌వ‌ర్క్‌గా నిలిచింది. తాజాగా రిలయన్స్‌ జియో జోరు కొనసాగుతూనే ఉంది. ఇది వరుసగా 11వ నెలలోనూ 4జీ స్పీడ్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
Image result for 4జీ స్పీడ్‌లో జియో
జియో డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 2017 నవంబర్‌లో 25.6 ఎంబీపీఎస్‌గా నమోదయ్యింది. టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ తాజాగా ఈ విషయాలను వెల్లడించింది. వొడాఫోన్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 10 ఎంబీపీఎస్‌గా రికార్డయ్యింది.ప్ప‌టికీ ఇత‌ర టెలికాం సంస్థ‌ల కన్నా అత్యంత వేగ‌వంత‌మైన 4జీ మొబైల్ ఇంట‌ర్నెట్ స్పీడ్‌ను ఇవ్వ‌డంలో జియోనే టాప్ స్థానంలో కొన‌సాగుతున్న‌ది.

ఇక వీటి తర్వాతి స్థానాల్లో భారతీ ఎయిర్‌టెల్‌ (9.8 ఎంబీపీఎస్‌), ఐడియా సెల్యులార్‌ (7 ఎంబీపీఎస్‌) ఉన్నాయి. జియో డౌన్‌లోడ్‌ స్పీడ్‌ అక్టోబర్‌లో 21.8 ఎంబీపీఎస్‌గా ఉంది. అప్‌లోడ్‌ స్పీడ్‌ విషయానికి వస్తే.. వొడాఫోన్‌ 6.9 ఎంబీపీఎస్‌తో టాప్‌లో నిలిచింది. దీని తర్వాతి స్థానంలో ఐడియా సెల్యులర్‌ (6.6 ఎంబీపీఎస్‌), జియో (4.9 ఎంబీపీఎస్‌), ఎయిర్‌టెల్‌ (4 ఎంబీపీఎస్‌) ఉన్నాయి.నెల నెలా జియో మొబైల్ ఇంట‌ర్నెట్ స్పీడ్ పెరుగుద‌ల‌ను న‌మోదు చేసుకుంటుంద‌ని ట్రాయ్ చెప్పింది. ఈ వివ‌రాల‌ను ట్రాయ్ గ‌తంలో విడుద‌ల చేసిన మై స్పీడ్ యాప్ ద్వారా సేక‌రించడం గ‌మ‌నార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: