దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో  ఉత్సాహంగా ప్రారంభమైనాయి. ఆరంభ లాభాల నుంచి మరింత ఎగిసి సెన్సెక్స్‌ లాభాల సెంచరీ కొట్టేసింది. ప్రస్తుతం 128 పాయింట్లు ఎగిసి 38,501 వద్ద, నిఫ్టీ 40పాయింట్లు లాభపడి11560 వద్ద కొనసాగుతోంది. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొన్నా.. మ‌న మార్కెట్లు మాత్రం నిల‌క‌డ‌గా ప్రారంభ‌మ‌య్యాయి. విదేశీ ఇన్వెస్టర్ల అండ‌తో సూచీలు చాలా స్థిరంగా ముందుకు సాగుతున్నాయి.  


విదేశీ ఇన్వెస్ట‌ర్లు మ‌న మార్కెట్లను ఎంత వ‌ర‌కు కాపాడుతార‌నే టెన్షన్ మ‌న‌ మార్కెట్ వ‌ర్గాల్లో నెల‌కొంది. నిఫ్టి ప్రధాన షేర్లలో భార‌తీ ఎయిర్‌టెల్‌, ఎల్ అండ్ టీ, ఇండియా బుల్స్ హౌసింగ్‌, ఎస్ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ షేర్లు  టాప్ గెయినర్స్‌లో ముందున్నాయి.


ఇక న‌ష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్ల‌లో జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్ షేర్లు టాప్ లూజ‌ర్స్‌లో ఉన్నాయి. అటు  జెట్‌ ఎయిర్‌వేస్‌ సహా ఎయిర్‌లైన్స్‌ షేర్లన్నీ లాభాల నార్జిస్తు‍న్నాయి. మరోవైపు లాభాలతో జోరుగా ఉన్న నిఫ్టీ బ్యాంకు 30వేల  వద్ద ఆల్‌ టైం ని టచ్‌ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: