నిమిషానికి 70 వేల డాలర్లు, గంటకు 40 లక్షల డాలర్లు, రోజుకు 10 కోట్ల డాలర్లు. ఇదే మొత్తాన్ని మన కరెన్సీలో చూస్తే...ఈ వరుస క్రమం రూ.49.72 లక్షలు, రూ.28.41 కోట్లు, రూ.714 కోట్లు. ఇదేంటో తెలుసా ప్రపంచ సంపన్న కుటుంబాల సంపద పెరిగిపోతున్న తీరు. అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ వ్యవస్థాపకులైన వాల్టన్ వంశీయుల సంపద ఈ సంపన్న కుటుంబాల్లోనే టాప్‌లో కదలాడుతున్నది. గతేడాది జూన్ నుంచి చూస్తే వాల్టన్ల సంపద ఏకంగా 39 బిలియన్ డాలర్లు ఎగబాకి 191 బిలియన్ డాలర్లకు చేరింది. అమెరికాలో వాట్సన్ కుటుంబం తరహాలోనే మరికొన్ని వ్యాపార, పారిశ్రామిక కుటుంబాల సంపద ఈ ఏడాది కాలంలో విపరీతంగా పెరిగినట్లు బ్లూంబర్గ్ తాజా నివేదిక చెబుతోంది. 


ఇక మిగ‌తా వివ‌రాల సంగతి చూస్తే.... చాక్లెట్ల తయారీదారులైన మార్స్ కుటుంబీకుల సంపద 37 బిలియన్ డాలర్లు ఎగిసి 127 బిలియన్ డాలర్లను తాకింది. కోచ్ కుటుంబ సంపద 26 బిలియన్ డాలర్లు పెరిగి 125 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మొత్తంగా చూసినైట్లెతే అమెరికాలోని 0.1 శాతం సంపన్నుల సంపద.. మిగతా ప్రపంచ దేశీయుల సంపద కంటే ఎప్పుడూ ఎక్కువగానే ఉంటున్నది. 1929 నుంచి ఇదే ఆనవాయితీ అంటే అర్థం చేసుకోవచ్చు.. సంపద సృష్టిలో అగ్రరాజ్యం దూకుడు ఎలా ఉందోనని. అయితే ఇప్పుడిప్పుడు ఆసియా, ఐరోపా దేశాలవారూ సంపదలో అమెరికాకు పోటీనిస్తున్నారు. భారతీయ అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ సంపద కూడా 7 బిలియన్ డాలర్లు పెరిగి 50 బిలియన్ డాలర్లను దాటింది.


బ్లూంబర్గ్ నివేదిక ప్ర‌కారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25 సంపన్న కుటుంబాల సంపద విలువ ఎంతో తెలుసా?.. 1.4 లక్షల కోట్ల డాలర్లు (డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రకారం రూ.100 లక్షల కోట్లు). నిరుడుతో చూస్తే 24 శాతం పెరుగడం గమనార్హం. సకల వ్యాపారాలు చేస్తున్న ఈ కుటుంబాల ఆస్తులు ఏటేటా పెరిగిపోతున్నాయని బ్లూంబర్గ్ తెలియజేసింది. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ (జీడీపీ)ల విలువ కంటే ఇందులోని ఒక్కో కుటుం బం సంపద విలువే ఎక్కువగా ఉండటం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: