ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంస్కరణలపై ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. నిర్మలాసీతారామన్ ప్రకటనతో భారత్   ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని విశ్లేషణలు చెబుతున్నాయి.


ముఖ్యంగా భారత్ ప్రపంచదేశాలకు ఓ పెట్టుబడుల స్వర్గ ధామంగా మారుతుందని అమెరికా పారిశ్రామిక వేత్తలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. నిర్మలా సీతారామన్ స్టార్టప్ లపై ఉన్న ఏంజెల్ టాక్స్ రద్దు చేయడం, విదేశీ పెట్టుబడుదారులకు నిక మదుపరులపై ఉన్న సంపన్న పన్ను తొలగించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.


ఇవన్నీ భారత్ లో పెట్టుబడులకు ఊతమిచ్చేవే అని అమెరికా సంస్థలు వెల్లడించాయి. ఆటోమొబైల్  రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడం సహా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి.. 70 వేల కోట్ల రూపాయలు మళ్లించడం వంటి చర్యలు భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తాయని అమెరికన్ ఇండస్ట్రియలిస్టులు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: